Amaravathi : రాజధాని అమరావతి నిర్మాణలో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని నిర్మాణంలో సింగపూర్ స్థానంలో వియత్నాం పాల్గొనేందుకు సిద్ధమయింది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని నిర్మాణంలో సింగపూర్ స్థానంలో వియత్నాం పాల్గొనేందుకు సిద్ధమయింది. 2018లో అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ముందుకు వచ్చిన సింగపూర్ లోని పలు సంస్థలు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలిగింది.
సింగపూర్ స్థానంలో వియత్నాం...
గత ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం నుంచి సింగపూర్ వైదొలగడంతో గతంలో 1679 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్-సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు అమరావతిలో రెండు వేల ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి వియత్నాం ముందుకు వచ్చింది. దీంతో సింగపూర్ స్థానంలో వియత్నాం వచ్చిందని, రాజధాని పనులు వేగం పుంజుకోనున్నాయని చెబుతున్నారు.