Vijaywada : ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి
విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు
విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
దిగువకు నీటి విడుదల...
ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి దిగువకు నిన్న 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. ఈరోజు ఉదయానికి 4.0 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు నిర్ణయ తీసుకోనున్నారు. దీంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరూ వాగులు, కాల్వలు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు.