Andhra Pradesh : డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎన్ని రాయితీలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యాపారం నిర్వహణ కోసం భారీ రాయితీలను ప్రకటించింది. సబ్సిడీతో కూడిన రుణాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి నుంచి డ్వాక్రా మహిళల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన తన కలల ప్రాజెక్టుగా డ్వాక్రా మహిళల గ్రూపులని తరచూ చెబుతుంటారు. మహిళలు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదాయం పొందినప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుందని భావించే చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల కాన్సెప్ట్ ను తీసుకు వచ్చి పెద్దయెత్తున ఇప్పటి వరకూ ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతి సందర్భంలో శుభవార్తలు చెబుతూ వస్తున్నారు.
లక్ష నుంచి పది లక్షల వరకూ...
తాజాగా కూడా చంద్రబాబు నాయుడు ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పారు. వ్యాపారం కోసం భారీ రాయితీలు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.లక్ష రూపాయల వరకు యూనిట్లకు రాయితీ ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది. మిగిలిన అరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు రుణంగా లభిస్తుంది. 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుంటే వారికి డెబ్భయి ఐదు వేలు రాయితీగా లభిస్తుంది. మిగిలిన మొత్తం బ్యాంకు రుణంగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు ఆవులు, రెండు గేదెలు, గొర్రెలు, మేకలు, షెడ్ వంటి వాటితో రెండు లక్షల రూపాయల యూనిట్ ను మహిళలు ప్రారంభించుకునేలా వీలుకల్పించింది.
బ్యాంకు రుణాలిచ్చి...
రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకూ కూడా రుణం మంజూరు చేయనున్నారు. ఈ యూనిట్లకు రాయితీ 1,35,000 ప్రభుత్వం ఇస్తుంది. ర బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ వంటివి ఏర్పాటు చేసుకునే వీలుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో కిరాణా షాపులు, పచ్చళ్ల తయారీ, డెయిరీ ఫాం, సిమెంటు బ్రిక్స్ యూనిట్, ఐస్‌క్రీమ్ తయారీ, కారంపొడి తయారీ, తేనె తయారీ, గార్మెంట్స్, ఎంబ్రాయిడరీ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు వంటి వాటిని నెలకొల్పేందుకు మహిళలకు మంచి అవకాశమని అధికారులు చెబుతున్నారు. డ్వాక్రా గ్రూపు సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.