Andhra Pradesh : నేడు సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9.54 గంటలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యాధునిక వసతులతో సీఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారు.
అనుకున్న సమయానికి...
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లుగానే అనుకున్న సమయానికి కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ కార్యాలయంలో అన్ని వసతులతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఆహ్వానించకపోవడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభించిన తర్వాత లోకేశ్ తో కలిసి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.