Chandrababu : మురిసి పోయిన చంద్రబాబు...ముప్ఫయి ఏళ్ల నాటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించారు

Update: 2025-11-01 02:53 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించారు. ఆ కారుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 393 నెంబరుతో ఉండే ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడు సొంత వాహనం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబర్ ఉన్న అంబాసిడర్ కాన్వాయిలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్ అంటేనే సీబీఎన్ బ్రాండ్ కార్ అనేలా ఈ కారు గుర్తింపు పొందింది.

వ్యక్తిగత పర్యటనకు...
నాడు అంబాసిడర్ కారులోనే చంద్రబాబు ప్రయాణించేవారు. ఆయన కాన్వాయ్ లో ఈ వాహనం ఆకర్షణగా నిలిచేది. వ్యక్తిగత పర్యటనలకే ఈ కారును ఉపయోగించేవారు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ కారులోనే ఎక్కువగా వ్యక్తిగత పర్యటనల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించేవారు. ఆ కారులో ప్రయాణం సుఖవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. దానితో తనకు ఉన్న అనుబంధాన్ని తలచుకుని చంద్రబాబు నాయుడు మురిసిపోయారు.
మూడు దశాబ్దాల క్రితం...
మూడు దశాబ్దాల క్రితం ఉపయోంచిన కారును చూసి చంద్రబాబు కాసేపు అక్కడే చూస్తూ నిల్చుండిపోయారు. ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు... భధ్రతా పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నా... తన సొంత కారు అయిన నాటి అంబాసిడర్ ను మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాదులో ఉన్న ఈ కారును అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇకపై ఉంచనున్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చి... తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారును చంద్రబాబు పరిశీలించి... ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు.
Tags:    

Similar News