Andhra Pradesh : జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చంద్రబాబు భేటీ

రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Update: 2025-10-28 08:00 GMT

రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ సమీక్షకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సబ్ కమిటీలోని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డిలు ఉన్నారు. ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వంటి అంశంపై చర్చించారు.

మంత్రివర్గ ఉప సంఘంతో...
గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజన జరిగిందని, గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు, పరిపాలనలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని భావించి కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన, మార్పులు చేర్పులు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఈ ఏడాది జూలైలో ఏడుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలు, ప్రజల అవసరాలు, సౌకర్యం, ఎన్నికల సమయంలో హామీలపైనా చర్చించారు.


Tags:    

Similar News