Vijayawada : నేటి నుంచి విజయవాడ ఉత్సవ్
నేటి నుంచి విజయవాడలో అతి పెద్ద ఫెస్టివ్ కార్నివాల్ ప్రారంభం కానుంది.
నేటి నుంచి విజయవాడలో అతి పెద్ద ఫెస్టివ్ కార్నివాల్ ప్రారంభం కానుంది. విజయవాడ ఉత్సవ్ పేరతో నేటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ జరగనుంది. ఈ విజయవాడ ఉత్స్వవ్ లో కళ, సాంస్కృతిక, సినీ, క్రీడా వైభవాన్ని చాటి చెప్పే ప్రదర్శనలను బెజవాడ వాసులను అలరించనున్నాయి. సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఆకట్టుకోనున్న...
ఈ ఉత్సవ్ ప్రారంభోత్సవానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేశ్ లు హాజరవుతారు. పున్నమి ఘాట్ లో జరిగే వేడుకలను వీరు ప్రారంభించనున్నారు. విజయవాడ ఉత్సవ్ కు సంబంధించిన అనని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఒకవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు, మరొకవైపు విజయవాడ ఉత్సవ్ జరుగుతుండటంతో బెజవాడ వాసులకు పదకొండు రోజుల పాటు అసలైన పండగ.