Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. బెల్ట్ షాపులను తొలగించడంతో పాటు అక్రమ మద్యంపై దాడులు నిర్వహించడంతో పాటు మద్యం అమ్మకాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
సీఆర్డీఏపై సమీక్ష...
అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు సీఆర్డీయే అథారిటీ సమావేశంలో పాల్గొంటారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులపై చంద్రబాబు సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్షిస్తారు.సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌కుచంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడ జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి 7.10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు