Andhra Pradesh : ఇన్ ఛార్జులుగా సీనియర్ ఐఏఎస్ ల నియామకం

ఆంధ్రప్రదేశ్ లోని ఐదు జిల్లాలకు సీనియన్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం జిల్లా ఇన్‌ఛార్జులుగా నియమించింది

Update: 2025-12-18 06:39 GMT

ఆంధ్రప్రదేశ్ లోని ఐదు జిల్లాలకు సీనియన్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం జిల్లా ఇన్‌ఛార్జులుగా నియమించింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు పాటించాల్సిన విధానాలను అమలు చేయడం, ఇంటర్‌ డిపార్ట్‌మెంట్స్‌ కో - ఆర్డినేషన్‌ కోసం పని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదు జిల్లాలకు...
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు జి.వీరపాండియన్‌, కాకినాడ జిల్లాకు ప్రసన్న వెంకటేశ్‌, బాపట్ల జిల్లాకు మల్లికార్జున్‌, శ్రీసత్యసాయి జిల్లాకు గంధం చంద్రుడు, నంద్యాల జిల్లాకు సి.హెచ్‌.శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.వీరు అధికారులను సమన్వయం చేసుకుని వెళ్లారని తెలిపారు.


Tags:    

Similar News