Andhra Pradesh : నేడు ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్ల సదస్సు
నేడు ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది.
నేడు ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. రెండు రోజుల పాటు జరగనున్నసదస్సులో ప్రభుత్వ ప్రాధాన్యతలను, సంక్షేమ కార్యక్రమాలఅమలు, లబ్దిదారుల సంతృప్తి, జిల్లాల్లో నెలకొన్న సమస్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో చర్చిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ రెండు రోజుల పాటు సదస్సులో పాల్గొంటారు.
రెండు రోజుల పాటు...
సచివాలయంలో బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇది ఐదో సదస్సు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు. మొదటిరోజు జీఎస్‌డీపీ, కేపీఐ, పబ్లిక్ పర్‌సెప్షన్, ఈ-ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, పెట్టుబడుల ప్రతిపాదనలు, సంక్షేమ పథకాలు, సాధికారత తదితర అంశాలపై చర్చించనున్నారు.