Andhra Pradesh : నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం

ఆంధ్రప్రదేశ్ లో నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది

Update: 2025-12-18 04:24 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం జిల్లా ఎస్సీలతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈరోజు ప్రధానంగా చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, హెచ్ఓడీలతో ఆదాయార్జన శాఖలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.

సాయంత్రం శాంతి భద్రతల సమస్యపై...
ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం.. జిల్లాల వారీగా పరిస్థితికి సంబంధించి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. యంత్రం కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై ప్రత్యేక చర్చ జరపుతారు. అన్ని జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు, డీజీపీ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నియంత్రణ... ఇతర అంశాలపై చర్చ జరగనుంది.


Tags:    

Similar News