Chandrababu : కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఏమన్నారంటే?
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ జరపడం లేదని చంద్రబాబు అన్నారు
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ జరపడం లేదని, పీపీపీ మోడల్ ప్రపంచంలోనే సక్సెస్ అయ్యాయని చంద్రబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. దానిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 9 శాతం వడ్డీకి రుణాలను తెచ్చిసర్దు బాటు చేస్తున్నామనిచెప్పారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. దానిని అడ్డుకోవడానికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ప్రత్యర్థుల ప్రచారాన్ని...
అయితే మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, అలాగే అప్పులమయం అయిందని కూడా దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. అన్ని సేవలను ఆన్ లైన్ లో అందించే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రుషికొండలో భవనాన్ని నిర్మించి గత ప్రభుత్వం నిరుపయోగంగా మార్చిందని, అది వైట్ ఎలిఫెంట్ గా మారిందని చంద్రబాబు అన్నారు.