Andhra Pradesh : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. పుష్కలంగా యూరియా

ఆంధ్రప్రదేశ్ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సిన అసవరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు

Update: 2025-09-12 02:09 GMT

ఆంధ్రప్రదేశ్ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సిన అసవరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ ఫలితమే ఈ కేటాయింపు అని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు ఈనెల 15 తేదీ నుంచి 22వ తేదీ లోపు విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకోనుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

రైతు అవసరాలకే...
రైతు అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో ఎరువుల కొరత రైతుల ఆందోళనలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అన్న అచ్చెన్న రైతు సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి రాష్ట్ర ప్రజల తరఫున మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.


Tags:    

Similar News