Andhra Pradesh : రైతులకు గుడ్ న్యూస్...రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నాయి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నాయి. ఈ నెలలోనే పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథ్నాలుగు వేల రూపాయలు రైతులకు అందచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతలుగా ఈ నిధులను మంజూరు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రెండు వేల రూపాయలతో కలిపి ఏపీ సర్కార్ తమ నిధులను కలిపి రైతులకు అందచేస్తుంది. ఇది రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
22వ విడత నిధులు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 21 దఫాలుగా పీఎం కిసాన్ నిధులను మంజూరు చేసింది. 22వ విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమయింది. వాస్తవానికి సంక్రాంతి సమయంలోనే ఈ నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే అప్పుడు సాధ్యపడలేదు. దీంతో ఇప్పుడు తాజాగా మరొక తేదీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మార్చి నెల 13వ తేదీన పీఎం కిసాన్ నిధులను రెండు వేల రూపాయలను జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అన్నదాత సుఖీభవ పథకం కింద...
పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే రోజు అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా విడుదల చేయాలని ఇటీవల వ్యవసాయ శాఖ సమీక్షలో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ విడత కూడా రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయల వరకూ నిధులు జమ అయ్యే అవకాశముందని తెలిసింది. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడత నిధులను జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సమాయత్తమయింది. దేశంలో పదకొడు కోట్ల మంది, ఏపీలో అరవై లక్షల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందనున్నారు. రేపు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల కానున్నాయి.