Raithu Bharosa : రైతు భరోసా నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కాలేదా? అయితే ఈ పనిచేయాల్సిందేనట

రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది

Update: 2026-03-24 04:41 GMT

రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. అయితే కొందరికి మాత్రం తమ ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదని ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారు తగిన విధంగా చేస్తే నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎన్ని ఎకరాలున్నా ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్నిఅందచేస్తుంది. ఇందుకు అవసరమైన మొదటి విడత నిధులను కూడా విడుదల చేసింది.

విడతల వారీగా...
విడతల వారీగా ఈ నిధులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నారు. అయితే ఇప్పటి వరకూ అర్హత ఉండి కూడా నగదు జమ కాని వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. రైతు భరోసా పథకం పొందేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సమయాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ బ్యాంకు వివరాలను అప్ డేట్ చేసుకోవాలని, లేకుంటే పడవని అధికారులు తెిపారు. ఫిబ్రవరి 28వ తేీవరకూ పట్టాదారు పాస్ పుస్తకాన్ని పొందిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
పట్టాదారు పాస్ పుస్తకాలున్నా...
అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలున్నప్పటికీ ఇప్పటి వరకూ రైతు భరోసా నిధులు అందని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత శాఖ అధికారులు వివరించారు. యాసంగి నిధులు జమ కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే తాజాగా ప్రభుత్వం రైతు భరోసా నిధుల విషయంలో కొన్ని నిబంధనలు కూడా ప్రభుత్వం మార్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఎకరం భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను తొలుత విడుదల చేసేవారు. అయితే ఈసారి మాత్రం ఎన్ని ఎకరాలున్నా తొలి విడత ఎకరాకు సంబంధించి అందరికీ ఆరు వేల రూపాయల చొప్పున నిధులు జమ అవుతున్నాయి. నిధులు జమకాని వారు తమ బ్యాంకు ఖాతాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News