Telangana : మేడారంలో ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు మేడారంలో పర్యటిస్తున్నారు

Update: 2026-01-19 02:44 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు మేడారంలో పర్యటిస్తున్నారు. ఉదయం కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ ను దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన సతీమణితో పాటు కుమార్తె, అల్లుడు, మనవడితో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మొత్తం 251 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను మేడారం జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు.

అభివృద్ధి పనులకు...
దీంతో పాటు మేడారంలో అభివృద్ధి చేసిన జంక్షన్ లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం హైదరాబాద్ కు వచ్చి అక్కడి నుంచి నేడు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మేడారంలో సమ్మక్క సారలమ్మలను మంత్రి వర్గ సభ్యులు కూడా దర్శించుకున్నారు. తన మనవడితో కలసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి మేడారంలో పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News