Telangana : మేడారంలో గద్దెలపైకి పగిడిద్ద రాజు, గోవింద రాజులు

మేడారంలో నేడు మంత్రి సీతక్క పర్యటించారు

Update: 2025-12-24 06:54 GMT

మేడారంలో నేడు మంత్రి సీతక్క పర్యటించారు. గద్దెలపై పగిడిద్ద రాజు, గోవింద రాజులు కొలువుదీరారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం గోవిందరాజులనును ఈరజు ఉదయం ఆరు గంటలకు పడిగద్ద రాజును ఉదయం 9.45 గంటలకు పూజారులు ప్రతిష్టరించారు. అయితే నేడు గద్దెలపై ప్రతిష్ట సందర్భంగా భక్తులను అనుమతిని నిరాకరించారు.

మంత్రి సీతక్కతో పాటు...
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, జాతర కార్యనిర్వాహణ అధికారి వీరాస్వామిలు పాల్గొన్నారు. పూజారులు తమ కుటుంబ సభ్యులతో హాజరై అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో మేడారం మహా జాతర జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే అక్కడ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి.


Tags:    

Similar News