మేడారానికి భక్తులు పోటెత్తతున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క-సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తుల బారులు తీరారు. ఈ నెల 28వ తేదీ నుంచి మేడారంలోని సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. అయితే ముందుగానే భక్తులు దర్శించుకోనున్నారు. గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
లక్షల సంఖ్యలో రావడంతో...
భక్తులు అత్యధికంగా సొంత వాహనాలతో తరలి రావడంతో పస్రా-మేడారం మధ్య వాహనాల రద్దీ పెరిగింది. దర్శనానికి లక్షల మంది భక్తుుల వస్తారని అంచనా వేసిన అధికారుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలతో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా పోలీసుల ఎక్కడికక్కడ జాగ్రత్తలు చెబుతున్నారు. వరస సెలవులతో భక్తుల రద్దీ పెరిగింది.