విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేటుకు అప్పగిస్తున్నారనే ప్రచారం వారి ఉనికి కోసం చేసే ప్రయత్నం మాత్రమేనని పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని కూడా ఆయన తెలిపారు.
వైసీపీ ట్రాప్ లో...
ఎవరికి అమ్ముతున్నారో చెప్పకుండా ప్రైవేటీకరణ అంటే అర్థం లేదన్న పల్లా శ్రీనివాస్ వెయ్యి కాంట్రాక్ట్ ఏజెన్సీలను 32కు కుదించడానికి మాత్రమే జరిగిందని ఆయన తెలిపారు. అదేసమయంలో వైసీపీ ట్రాప్ లో కార్మిక సంఘాలు ఎవరూ పడవద్దని తెలిపారు. విశాఖ ప్రయివేటీకరణ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని పల్లా శ్రీనివాస్ తెలిపారు.