నేడు అనకాపల్లి జిల్లాలో మంత్రి నారా లోకేశ్

నేడు అనకాపల్లి జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు.

Update: 2026-02-28 04:03 GMT

నేడు అనకాపల్లి జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు. బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ యూనిట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నారు. బ్లూజెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్న లోకేశ్ అక్కడి పెట్టుబడి దారులతో మాట్లాడనున్నారు.

బ్లూజెట్ హెల్త్ కేర్...
సుమారు 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్‌కేర్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 2028-29 ఆర్థిక ఏడాదిలో బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఈ సంస్థ ఏర్పాటుతో 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన ఉంటుందని అధికారులు తెలిపారు. లోకేశ్ పర్యటనతో అక్కడ భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News