నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.
నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. సాయంత్రం 6:10కి ఐఎన్‌ఎస్ డేగా కు రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. రాష్ట్రపతికి గవర్నర్ నజీర్, ఉప ముఖ్యమంత్రి స్వాగతం పలకనున్నారు. నేవల్ బేస్‌లో రాష్ట్రపతి ముర్ము బాంక్వెట్ డిన్నర్ లో పాల్గొంటారు. రేపు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు.
రేపు జరిగే కార్యక్రమంలో...
రేపు జరిగే ఐఎఫ్‌ఆర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అనుమతులు ఉన్నవారికే పాస్ లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం రేపు తిరిగి ద్రౌపది ముర్ము ఢిల్లీకి బయలుదేరి వెళతారు.