Ys Jagan : నేడు విశాఖ, అల్లూరి జిల్లాలకు జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Update: 2026-03-04 02:29 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో ఆయన పర్యటన కేవలం వ్యక్తిగత పర్యటనల కోసమే వెళుతున్నారు. ఉదయం 11.30 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు చేరుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.

వివాహ కార్యక్రమాలకు...
అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుని రాణాప్రతాప్‌ నగర్‌లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నివాసానికి వెళతారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. జగన్ పర్యటన సందర్భంగా ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి వస్తారని తెలిసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News