పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం
విశాఖలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది
విశాఖలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయి. అయితేప్రమాద సమయంలో కాన్వాయ్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేరు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పికప్ చేసుకోవడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
విశాఖ పర్యటనలో...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ నిన్న విశాఖకు వచ్చారు. అయితే బస చేసిన ప్రాంతానికి కాన్వాయ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో మరొక కాన్వాయ్ ను పవన్ కల్యాణ్ కు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనే ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఫెస్టివల్ లో పవన్ పాల్గొనాల్సి ఉంది.