విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు

Update: 2026-02-18 07:46 GMT

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ , గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

వివిధ దేశాలకు చెందిన...
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల హాజరయ్యారు. విశాఖపట్నం సముద్ర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమం అలరించింది. వివిధ దేశాలకు చెందని యుద్ధ నౌకల విన్యాసాలను తిలకించారు. రాష్ట్రపతి ముర్ము ఈ కార్యక్రమం తర్వాత తిరిగి విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News