Andhra Pradesh : రైవాడ జలాశయం వైపు వెళ్లొద్దండి

అనకాపల్లి జిల్లాలోని నదులు ప్రవహిస్తున్నాయి. అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Update: 2025-10-29 04:17 GMT

అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లి మండలం, రైవాడ జలాశయంలో ఈరోజు ఉదయం నాటికి నీటి మట్టం 112.95 మీటర్లకు చేరుకుంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 114.00 మీటర్లు కాగా, ప్రస్తుతం జలాశయంలోకి సుమారు 1,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో, జలాశయం నుంచిఅదనపు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడడంతో, మూడు స్పిల్ వే గేట్లు తెరచి సుమారు 9,000 క్యూసెక్కుల నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు.

నీటి ప్రవాహం మరింతగా...
దీని ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైవాడ జలాశయం దిగువ భాగంలోని ప్రజలు, రైతులు, పశువులను కాసే వారు, మత్స్యకారులు మరియు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలను మరియు పశువులను నది పరిసరాలకు వెళ్లనివ్వవద్దని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజలు భయపడవలసిన అవసరం లేదని, స్థానిక పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News