Visakhapatnam : విశాఖ ఎయిర్ పోర్టుకు వీఐపీల తాకిడి
విశాఖ విమానాశ్రయానికి ప్రముఖులు నేడు వస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు
విశాఖ విమానాశ్రయానికి ప్రముఖులు నేడు వస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రేపు అంతర్జాతీయ యోగా డే వేడుకలను విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటుండటంతో విమానాశ్రయంవద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు విశాఖ ఎయిర్ పోర్టుకు ఉదయం చేరుకోనున్న మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చారు.
భారీ బందోబస్తు...
విశాఖ ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకుంటుండటంతో భారీగా జనసేన శ్రేణులు కూడా విమానశ్రాయానికి చేరుకుంటున్నారు. సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. సాయంత్రం ఐఎన్‍ఎస్ డేగకు చేరుకోనున్న ప్రధాని మోదీకి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.లు స్వాగతం పలకనున్నారు. దీంతో ఎయిర్ పోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.