Andhra Pradesh : ఉత్తరాంధ్రలో ఉప్పొంగుతున్న నదులు
భారీ వర్షాలతో వంశధార,నాగావళి నదులకి వరద ప్రవాహం ఎక్కువయింది. ఉత్తరాంధ్రలోని నదులు ఉప్పొంగుతున్నాయి
భారీ వర్షాలతో వంశధార,నాగావళి నదులకి వరద ప్రవాహం ఎక్కువయింది. ఉత్తరాంధ్రలోని నదులు ఉప్పొంగుతున్నాయి. గొట్టాబ్యారేజ్, తోటపల్లి వద్ద వరదనీటి ఉధృతి పెరుగుతుంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను నీటి పారుదల శాఖ అధికారుల జారీ చేశారు. గొట్టా బ్యారేజీ ప్రస్తుతం ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 68,893 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు...
తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 30,840, ఔ ట్ ఫ్లో 14,970 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం,విజయనగరం జిల్లా ప్రాంతాలు ఎక్కువగా దీని వల్ల ప్రభావితమవుతాయని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వరద నీరు గ్రామాల్లోకి చేరే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.