Simha Chalam : సింహాచలంలో కొనసాగుతున్న గిరిప్రదిక్షణ

సింహాచలం ఆలయం గిరిప్రదిక్షణ కొనసాగుతుంది. నిన్న ప్రారంభమైన గిరి ప్రదిక్షిణ నేటి సాయంత్రం వరకూ కొనసాగే అవకాశముంది.

Update: 2025-07-10 03:10 GMT

సింహాచలం ఆలయం గిరిప్రదిక్షణ కొనసాగుతుంది. నిన్న ప్రారంభమైన గిరి ప్రదిక్షిణ నేటి సాయంత్రం వరకూ కొనసాగే అవకాశముంది. గిరి ప్రదిక్షిణలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయిన గిరి ప్రదిక్షిణం ఈరోజు రాత్రి వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. మొత్తం 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదిక్షిణ చేయాల్సి ఉంది.

భారీగా తరలి రావడంతో...
గిరిప్రదిక్షిణ చేయడం కోసం భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో మొక్కులు తీర్చుకునే వారు ఈ గిరిప్రదిక్షిణలో పాల్గొంటే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు వేల మంది పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. అలాగే విశాఖ పట్నంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. ఈరోజు సాయంత్రం వరకూ విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News