Pawan Kalyan : రుషికొండ భవనాలపై పవన్ సంచలన నిర్ణయం
రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఉపయోగించుకోవాలని తాను ప్రభుత్వానికి తెలియజేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు
రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఉపయోగించుకోవాలని తాను ప్రభుత్వానికి తెలియజేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. రుషికొండ భవనాలను పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇప్పుడు ఏడాదికి విద్యుత్తు బిల్లు ఏడు కోట్ల రూపాయలు వస్తుందని ఆయన అన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్ లో ఇంకా కేసు నడుస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. భవనం నిర్వహణ పెద్ద సమస్యగా మారిందని, నిర్మాణానికి 453 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వెచ్చించిందన్నారు.
చంద్రబాబుతో చర్చించిన తర్వాత...
నాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించిందని, అయితే దీనిని ఇప్పుడు టూరిజం శాఖకు అప్పగిస్తే బాగుంటుందని తాను అభిప్రాయపడుతున్నానని తెలిపారు. భవనంలో కొన్ని చోట్ల పెచ్చులూడిపోతున్నాయని, కొన్ని మరమ్మతులు కూడా చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత రుషికొండ భవనం వినియోగంపై తగిన నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ తెలిపారు.