నేడు కూడా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన
విశాఖపట్నంలో రెండోరోజు కు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
విశాఖపట్నంలో రెండోరోజు కు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న ప్రారంభమయిన ఆందోళన నేడు కూడా కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో మెస్ ఆహారంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థుల ఆందోళన కు దిగారు. పరుగులు అన్నాన్ని తాము తినలేకపోతున్నామని తెలిపారు.
మెయిన్ గేట్ వద్ద...
మెయిన్ గేట్ వద్ద బైఠాయించి విద్యార్థుల ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి నేలపైనే పడుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులుకు అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.