Andhra Pradesh : ఆంధ్రాయూనివర్సిటీలో టెన్షన్.. ముట్టడించిన విద్యార్థులు

విశాఖపట్నంలో ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థులు రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు

Update: 2025-09-26 07:47 GMT

విశాఖపట్నంలో ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థులు రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. మణికంఠ అనే విద్యార్థి వైద్యం సకాలంలో అందక మరణించడంతో రెండు రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో అంబులెన్స్ లు పెట్టాలని, అదనంగా మరొక హెల్త్ సెంటర్ ను పెట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీసీ రాజశేఖర్ ఛాంబర్ ను ముట్టడించారు.

రెండో రోజు కొనసాగుతున్న...
వైస్ ఛాన్సిలర్, రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను అడ్డుకున్నారు. ఇద్దరు విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తసీుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే శాసనసభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని, చర్చకు రాకుండా ఆందోళన చేస్తామంటే సీరియస్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Tags:    

Similar News