Nara Lokesh : నేడు విశాఖలో నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఇప్పటికే లోకేశ్ విశాఖకు చేరుకున్నారు.

Update: 2025-08-29 02:43 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఇప్పటికే లోకేశ్ విశాఖకు చేరుకున్నారు. ఈరోజు ఐసీఏఐ జాతీయ సదస్సుతో పాటు చంద్రపాలెం జడ్పీ హైస్కూలులో ఏఐ ల్యాబ్ ప్రారంభోత్సవానికి నారా లోకేశ్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం నోవోటెల్ హోటల్ లో ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ పై సీఐఐ సదస్సులో లోకేశ్ పాల్గొంటారు.

వివిధ కార్యక్రమాలలో...
అనంతరం సాయంత్రం ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా దినోత్సంలో నారా లోకేశ్ పాల్గొంటారు. ఈరో్జు సాయంత్రం రాడిసన్ బ్లూ హోటల్ లో భారత మహిళ క్రికెట్ జట్టు సభ్యులతో నారా లోకేశ్ సమావేశం కానున్నారు. నారా లోకేశ్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే పార్టీ నేతలతో జరిగే సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News