Visakha Metro : విశాఖ డబుల్ డెక్కర్ మెట్రోకు 6250 కోట్లతో టెండర్లు

విశాఖపట్నంలో మూడు కారిడార్లలో మెట్రో నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది

Update: 2025-09-06 03:28 GMT

విశాఖపట్నంలో మూడు కారిడార్లలో మెట్రో నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. 6250 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును నిర్మించనున్నట్లు టెండర్లలో పేర్కొంది. ఈ మేరకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ అంతర్జాతీయ పోటీ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 12వ తేదీతో టెండర్ గడువు ముగియనుంది.

46 కిలోమీటర్ల మేరకు...
ఈ ప్రాజెక్టులో విశాఖలో మొత్తం 46.23 కిలోమీటర్ల దూరం కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో 20.16 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ నాలుగులైన్ల ఫ్లైఓవర్ ఉండనుంది. 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యకు తెరపడనుందని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువ మంది మెట్రో రైళ్లను ఆశ్రయిస్తారని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News