Chandrababu : నేడు విశాఖకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నం వెళుతున్నారు. నేడు విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నం వెళుతున్నారు. నేడు విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 11.15 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటారు. అనంతరం అక్కడ జరిగే నోవోటెల్, రాడిసన్ బ్లూ హోటళ్లలో జరిగే రెండు జాతీయ సదస్సుల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
విశాఖ నుంచి...
ఈ సదస్సుల్లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజవర్గానికి వెళతారు. కుప్పం నియోజకవర్గంలో 29, 30వ తేదీలు అక్కడే ఉంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబు ప్రజలతో కూడా సమావేశమవుతారు. ముఖ్య నేతలు, కార్యకర్తలతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.