టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశం,బర్రెలక్క బాటలో... గల్ఫ్ అభ్యర్థి ,బిక్షగాడి ఆస్తి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే... నెల సంపాదన ఎంతంటే?

Update: 2023-11-26 12:56 GMT


Ambati Rambabu : రేపటి నుంచి మళ్లీ కామిడీ షో ..యువగళంపై అంబటి సెటైర్

రేపటి నుంచి ఆగిపోయిన హాస్య కథా చిత్రమ్ ప్రారంభమవుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసలు పుత్రుడు కామిడీ షో రేపటి నుంచి మళ్లీ మొదలు పెడుతున్నారన్నారు. లోకేష‌ యువగళం పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుండటంపై ఆయన సెటైర్ వేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంలో మత్స్యకారులను వెంటనే ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు.

అమ్మో... మళ్లీ వస్తోంది... వెంటిలేటర్లతో సహా అంతా సిద్ధం చేసుకోండి

కరోనా వైరస్ పోయిందిలే అని అందరూ ఊపిరిపీల్చుకున్న తరుణంలో మరో భయపెట్టే వార్త మనకు కనిపిస్తుంది. చైనాలో మళ్లీ వైరస్ విజృంభిస్తుంది. న్యుమోనియా లక్షణాలు ఎక్కువమందిలో కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కువగా చిన్నారుల్లో ఈ వ్యాధి తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిపై పోలీస్ కేసు..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ పోలీస్ కేసు నమోదు చేయడానికి సిద్దమవుతున్నారట. తమిళ మీడియా వర్గాలు ఈ వార్తలను రాసుకొస్తున్నాయి. రేపు కోర్టులో చిరంజీవి పై క్రిమినల్ మరియు పరువు నష్టం దావా కేసు నమోదు చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చినీయాంశంగా మారింది. అసలు ఏమైంది..? చిరంజీవి పై కేసు నమోదు చేయడం ఎందుకు..?

బర్రెలక్క బాటలో... గల్ఫ్ అభ్యర్థి

అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్ లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్ గ్రామంలో ఆదివారం (26.11.2023) బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఘీభావం ప్రకటించారు.

Ponnam Prabhakar : గెలుపు అవకాశాలున్నాయట.. అందుకే ఏరి కోరి?

ఏ రాజకీయ నేతకైనా ఒకటే కల. శాసనసభ్యుడిని కావడం. పార్లమెంటు సభ్యత్వం కూడా పెద్దగా పట్టించుకోరు. ఎవరూ దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. పార్లమెంటు సభ్యుడి హోదా తప్ప రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదని భావిస్తారు. అందుకే ప్రతి ఒక్క రాజకీయ నేత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని తన లక్ష్యంగా పెట్టుకుంటారు. అందునా కొంత హైప్ ఉన్న పార్టీ అయితే మరీ ఎక్కువ ఉబలాటి పడిపోతారు.

Beggar : బిక్షగాడి ఆస్తి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే... నెల సంపాదన ఎంతంటే?

బిచ్చమెత్తుతున్నాడని తక్కువగా చూడకండి. చేతులు చాస్తున్నాడని అలుసుగా అస్సలు కోపం ప్రదర్శించకండి. ఎందుకంటే వారిలో కోటీశ్వరులున్నారు. మనకంటే సంపద ఉన్న వారు కూడా ఉంటారు. బిక్షగాళ్లు అని ఈసడించుకోవడం అనవసరం. అవసరమైతే తమకు తోచిన సాయం చేయడం తప్ప... బిక్షగాళ్లను తీసివేయలేని పరిస్థితి. వారి రోజువారీ ఆదాయం ఎంతో వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. కష్టపడకుండా సంపాదించడం అంటే ఇదే కాబోలు. వారి ముందు మనం ఎందుకూ పనికిరాం.
తెలంగాణ ఎన్నికల సమయంలో యువ ఎన్నికల ఓటర్లపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను తాము తీరుస్తామని, జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్ నిరుద్యోగులతో సమావేశమై తాము మళ్లీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. తాజాగా రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ వెళ్లి ఉద్యోగార్థులను కలసి చిట్ చాట్ చేశారు.
కేరళలో విషాదం నెలకొంది. కొచ్చిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ వార్షికోత్సవంలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ తొక్కిసలాటలో 64 మంది వరకూ విద్యార్థులంతా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిన్న రాత్రి యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ లో మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వం డిసెంబరు 2వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే దానికి రెండు రోజులు ముందుగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొత్తం పంద్దొమ్మిది పనిదినాలు ఉండాలని నిర్ణయించామని తెలిపారు.

మందు బాబులకు షాకింగ్ న్యూస్...

మద్యం దుకాణాలు రెండు రోజుల పాటు బంద్ చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. తిరిగి 30వ తేదీ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. దాదాపు రెండు రోజుల పాట తెలంగాణలో మద్యం విక్రయాలపై నిషేధం ఉండనుంది. దీంతో మద్యం ప్రియులకు షాక్ అయిన వార్త అని చెప్పాలి.

Tags:    

Similar News