టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-11-21 12:51 GMT


Chandrababu: ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా

మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. మద్యం విషయంలో చంద్రబాబు అధికారంలో ఉండగా అవినీతి జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Congress : కాంగ్రెస్ కు 78 సీట్లు రావడం ఖాయం

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మధిరలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ను రత్నం అని నమ్మి పదేళ్లు అధికారమిచ్చిన ప్రజలు రాయిని నెత్తిన పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ కు 20 సీట్లు వస్తాయని అనుకుంటే కేసీఆర్ కాకిలాగా ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. వంద మంది కేసీఆర్‌లు వచ్చినా మధిర ప్రజలను కొనలేరని అన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని, వాటిని జనం నమ్మడం మానేశారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Breaking : ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశం

ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్ కు సంబంధించి ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చంద్రబాబు సన్నిహితులకు సంబంధించిన 114 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. ఆస్తుల అటాచ్‌మెంట్ కు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది.

KCR : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే.. చెప్పేసిన కేసీఆర్

కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో వచ్చేది 20 సీట్లు మాత్రమేనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. మధిర సభలో ఆయన ప్రసంగించారు. అభ్యర్థుల వెనక పార్టీల చరిత్ర కూడా ఏదో చూడాలని కేసీఆర్ కోరారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా కాలయాపన చేశారన్నారు. దీంతో తాను ఆమరణ దీక్షకు దిగానని తెలిపారు. ఇది అందరి ముందు జరిగిన చరిత్ర అన్నారు.

అలా చేయలేము.. విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమి న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. కోచింగ్‌ సెంటర్లను నియంత్రించడం విషయంలో.. సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది.

Narendra Modi : టీం ఇండియాకు మోదీ ఓదార్పు

టీం ఇండియా ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్చారు. ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి చెందిన తర్వాత మోదీ టీం ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూంకు వెళ్లారు. ప్రతి ఒక్క ఆటగాడిని ఆప్యాయంగా పలకరించారు. వారిని అక్కున చేర్చుకున్నారు. ఆలింగనం చేసుకుని ఓదార్పు మాటలు చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ఈసారి విజయం సాధించేందుకు పోరాటం చేయడమే మనముందున్న లక్ష్యమని, ఓటమితో కుంగిపోకూడదని మోదీ ఊరడించారు.

Telangana Elections : పార్టీ మారిన 14 మంది ఎమ్మెల్యేల ఫేట్ ఎలా ఉందంటే... ఇది చదవండి మరి

తెలంగాణ ఎన్నికల్లో పోటీ నువ్వా? నేనా అన్నట్లు సాగుతుంది. ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యనే ఉందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అధికారంలోకి ఎవరు వచ్చినా తక్కువ స్థానాలతోనే వస్తారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 2018 ఎన్నికలలో గెలిచి తిరిగి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి గెలుపోటములపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ లో గత ఎన్నికల్లో 19 మంది ఎమ్యెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలవగా అందులో పన్నెండు మంది అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.

Telangana Elections : ఆ బీఫారం అంత ఖరీదా... కోట్లు చెల్లించి కొనుగోలు చేశారా?

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో తొమ్మిదిరోజులు మాత్రమే పోలింగ్ కు గడువు ఉంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 28వ తేదీతో ప్రచారం ముగియనుంది. అనేక పార్టీలు తెలంగాణలో పోటీ పడుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఎస్పీ కూడా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించుకుని ప్రచారంలో ముందుకు వెళుతుంది. అయితే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులు కూడా కొందరు పోటీలో నిలుచున్నారు.

అలా చేయలేము.. విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల బలవన్మరణాలకు ప్రధాన కారణమి న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే కోచింగ్ సెంటర్లను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. కోచింగ్‌ సెంటర్లను నియంత్రించడం విషయంలో.. సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది

YSRCP : అడ్డగోలు హామీలతో మీ ముందుకు వస్తే.. మోసపోకండి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డగోలు హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్ లను ఉపయోగిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ దొంగల ముఠా వస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ అంటూ ముందుకు వస్తున్నారని, వచ్చే ఏడాది జూన్ 20 నుంచి మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అంటూ ఇచ్చిన హామీలను నమ్మితే మరోసారి మోసపోవడమేనని అన్నారు.

Tags:    

Similar News