Fri Dec 05 2025 14:58:18 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : టీం ఇండియాకు మోదీ ఓదార్పు
టీం ఇండియా ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్చారు. భారత్ ఓటమి చెందిన తర్వాత మోదీ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూంకు వెళ్లా

టీం ఇండియా ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్చారు. ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి చెందిన తర్వాత మోదీ టీం ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూంకు వెళ్లారు. ప్రతి ఒక్క ఆటగాడిని ఆప్యాయంగా పలకరించారు. వారిని అక్కున చేర్చుకున్నారు. ఆలింగనం చేసుకుని ఓదార్పు మాటలు చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ఈసారి విజయం సాధించేందుకు పోరాటం చేయడమే మనముందున్న లక్ష్యమని, ఓటమితో కుంగిపోకూడదని మోదీ ఊరడించారు.
ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ...
మహ్మద్ షమిని ఆలింగనం చేసుకున్నారు. టీం ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన ప్రధాని మోదీ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించారు. ఓటమితో పోయేదేమీ లేదని తెలిపారు. జయాపజయాలు సహజమేనని ఊరటనిచ్చే మాటలు తెలిపారు. ఈ నెల 19న అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఉన్న టీం ఇండియా ఆటగాళ్లను ప్రధాని మోదీ కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story

