ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అనేక విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే హాలీవుడ్ టెలి సిరీస్ క్వాన్టికో లో అవకాశం రాగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది ప్రియాంక చోప్రా. ఇప్పుడు హాలీవుడ్ లో హీరోయిన్ లతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుని పారితోషికాలు కూడా అధికంగానే అందుకుంటుంది. ప్రియాంక నటిస్తున్న క్వాన్టికో సిరీస్ సూపర్ సక్సెస్ కావటంతో ఆమెకు హాలీవుడ్ చిత్రాలలోనూ అవకాశాలు తలుపు తడుతున్నాయి. దీనితో ముందుగా ఒప్పుకున్నా ఒకటి రెండు బాలీవుడ్ కమిట్మెంట్స్ తప్ప కొత్త అవకాశాలు ఏమి బాలీవుడ్ నుంచి తీసుకోవటం లేదు ఈ భామ.
ఇంత కాలానికి తన ప్రతిభ కి శ్రమ కి తగ్గ విధంగా పారితోషికం అందుతుంది అనుకుందో ఏమో కాల్ షీట్స్ అన్ని హాలీవుడ్ నిర్మాతలకి సర్దుతుంది ప్రియాంక చోప్రా. క్వాన్టికో సిరీస్ కి సంబంధించి ఒక్కో ఎపిసోడ్ కి కోట్ల రూపాయలలో అందుతున్నాయి. దానితో ఇప్పుడు ప్రియాంక కు ముంబై నగరం లో ఉంటున్న విలాసవంతమైన ఇంటిపై మొహం మొత్తింది అమ్మడికి. ముంబై నగరంలో అంధేరి ప్రాంతంలోని ఒక విలాసవంతమైన బంగ్లా ని ఒక బడా బాబు నుంచి 100 కోట్ల రూపాయలకి బేరం చేసుకుంది అంట. ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకుని త్వరలోనే అందులోకి మారనుంది అంట ప్రియాంక చోప్రా.
ప్రియాంక చోప్రా ఆదాయం చూసి మిగిలిన బాలీవుడ్ కథానాయికలు కూడా హాలీవుడ్ అవకాశాలు కోసం ఆరాట పడటం ఖాయం.