సామాన్యుడికి నోట్ల వివరాలు తెలిపిన ఆర్.బి.ఐ

Update: 2016-12-21 23:00 GMT

ఆర్ధిక లావాదేవీలకు అధికంగా నగదునే వినియోగించే దేశాలలో భారత దేశం కూడా ఒకటి. దాదాపు 120 కోట్లకు చేరిన భారత జనాభాలో కనీస విద్యార్హత కు నోచుకోని వారు మూడో వంతు జనాభా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఇదే భారత దేశంలో లెక్కల్లో చూపలేని నల్ల ధనం భారీగా పెరిగి పోయింది. ఆ విధానాన్ని అరికట్టేందుకే పెద్ద నోట్లు రద్దు చేసాం అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రద్దైన నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ ముద్రించి అందుబాటులోకి తీసుకురావటానికి ఎంత ఖర్చు చేస్తున్నది, నేటి వరకు ఎందరో పౌరులకు సమాధానం దొరకని ప్రశ్న గా మిగిలిపోయింది. పలు ఆర్ధిక వేత్తలు పలు విధాలుగా వివరణ ఇచ్చినప్పటికీ అవి సందేహాలు పెంచాయి తప్ప తగ్గించలేదు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం పలు ఛానెళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చిన పలువురు ఆర్ధిక నిపుణులు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం కరెన్సీ ముద్రణకు 35 వేల కోట్లు వెచ్చిస్తుందని, ఒక్కో 1000 రూపాయల నోటు ముద్రణకు 28 రూపాయల వ్యయం అవుతుంది అని రకరకాలుగా చెప్పారు. అయితే సమాచార హక్కు చట్టం ద్వారా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కు చంద్ర శేఖర్ గౌడ్ అనే పౌరుడు ఇదే ప్రశ్నకు సమాధానం కోరగా కొత్త 500 రూపాయల నోటు ముద్రణకు 3 .09 రూపాయలు, రెండు వేల రూపాయల నోటు ముద్రణకు 3 .54 రూపాయలు ఖర్చు చేస్తునట్టు భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ల ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ (బి.ఆర్.బి.ఐ.ఎం.ఎం.పి.ఎల్) సంస్థ వెల్లడిస్తూ చంద్ర శేఖర్ గౌడ్ కు వివరాలు పంపింది. పాత ఐదు వందల నోటు ముద్రణకు కూడా ప్రస్తుత నోటుకు అవుతున్న ఖర్చే అయ్యేదట.

Similar News