6May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడిన వారికి మాత్రమే నిధులను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇందుకు ఈ నెల 9వ తేదీ డెడ్ లైన్ గా పెట్టారు.

Update: 2024-05-06 13:55 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : రైతుభరోసా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.. కానీ వారికి మాత్రమే

రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడిన వారికి మాత్రమే నిధులను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇందుకు ఈ నెల 9వ తేదీ డెడ్ లైన్ గా పెట్టారు.

Enforcement Directorate : అటెండర్ ఇంట్లో ఇరవై కోట్లు.. నోట్ల కట్టలు లెక్క పెట్టలేక అధికారుల గుడ్లు తేలేశారట

ఎన్నికల సమయంలో నగదు పంపిణీ దేశంలో మామాలూ విషయం అయిపోయింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఖర్చు చేసే అభ్యర్థులు ఎవరూ లేరు. అధికారులు కూడా పెద్దయెత్తున దాడులు చేస్తూ ఎక్కడికక్కడ నగదును, బంగారాన్ని,అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.

Ap Politics : కేసీఆర్ కు ధరణి భారమయింది... జగన్ కు "ల్యాండ్" ప్రాబ్లెం కానుందా?

తెలంగాణ ఎన్నికలకు, ఏపీ ఎన్నికలకు పోల్చి చూడటం సర్వసాధారణం. సంక్షేమ పథకాలను అమలు పర్చినా కేసీఆర్ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ పదేళ్ల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలు గతంలో తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం నుంచి అందుకోలేదు. ఒకటా.. రెండా..

Chandrababu : చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నట్లే ఉన్నాడు... ఆయన ప్రతి అడుగు అదే చెబుతుందిగా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లే కనపడుతున్నాడు. ఆయన ప్రతి అడుగులోనూ టెన్షన్ కనిపిస్తుంది. నిర్ణయాల్లో కావచ్చు.. ప్రసంగాల్లో కావచ్చు.. కొంత తేడా కనపడుతుంది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చంద్రబాబు ప్రసంగాల్లో కొంత మాటలు కూడా స్లిప్ అవుతున్నారు.

Ys Jagan : జగన్ లో బేలతనం.. చివరి క్షణంలో షాకిస్తారని ఊహించలేదా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనాలకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలు ఆయన డీలా పడ్డారు. బేలతనం కనిపిస్తుంది. గత ఐదేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని రకాలుగా సహకరించినందుకు తనపైకి దూకుడుగా రారని జగన్ భావించారు. కాని నిన్నటి మొన్నటి వరకూ సీన్ అలాగే కనిపించింది.

Breaking : ఏపీ ప్రభుత్వ పథకాలకు ఎన్నికల సంఘం బ్రేక్

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిధుల విడుదలకు నో చెప్పింది. తుఫాను కారణంగా రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ఇచ్చే నిధులను కూడా విడుదల చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Road Acciddent : కారు లోయలోపడి.. ముగ్గురి మృతి

ఉత్తరాఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాల్వలో పడి ముగ్గురు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని డెహరాడూన్ ఈ ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ ను వికాస్ నగర్ లో కాల్వలో పడగా అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మరణించారు. కారులో ఉన్నవారంతా హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారే. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ఉన్నారు.

Breaking : కవితక్కకు దక్కని ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరించింది. కవిత వేసిన పిటీషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. రేపటితో కవిత జ్యడిషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

Breaking : కొత్త డీజీపీ గా ఈ ముగ్గురు పేర్లను

ఆంధ్రప్రదేశ్ లో కొత్త డీజీపీ నియామకం ఈరోజు జరిగే అవకాశముంది. ఏపీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పించిన సంగతి తెలిసిందే. ఆయనను వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను పంపాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కేంద్రఎన్నికల కమిషన్ ఆదేశించింది.

KTR : ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాత ఓట్లడిగితే బాగుండేది

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక గ్యారంటీ అమలుచేసి మగాళ్లకు, మహిళలకు మధ్యకొట్లాట పెట్టిందని ఆయన ఉచిత బస్సు ను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఆయన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.


Tags:    

Similar News