Gold Prices Today : మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్.. అయితే అంత కంగారు పడాల్సిన పనిలేకుండానే

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది.

Update: 2024-05-07 03:45 GMT

బంగారం అంటే మహా ప్రీతి ప్రతి ఒక్కరికి. అది లోహమే కావచ్చు. దానికి ఉన్న డిమాండ్ ప్రపంచంలోనే మరే వస్తువుకు ఉండదు. ఎందుకంటే అది స్టేటస్ సింబల్. ఎంత బంగారం ఉంటే అంత గౌరవం పెరుగుతుందన్న భావనతో ఎక్కువ మంది బంగారాన్ని, వెండిని కొనుగోలు చేస్తుంటారు. బంగారం ఉంటే భవిష్యత్ కూడా భద్రంగా ఉందని భావిస్తుంటారు. అవసరమయినప్పుడు వెంటనే విక్రయించి సొమ్ము చేసుకునే వీలు కూడా ఒక్క బంగారం, వెండి వస్తువులలో మాత్రమే ఉండటం కూడా గిరాకీ అధికంగా ఉండటానికి కారణంగా చెప్పాలి.

కొనుగోళ్లు లేకున్నా...
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ముహూర్తాలు లేకపోవడం, పెళ్లిళ్ల సీజన్ మరో మూడు నెలల పాటు లేకపోవడంతో కొనుగోళ్లు కూడా కొంత మందగించాయని చెబుతున్నారు. బేరాలు లేకపోవడంతో ధరలు దిగి వస్తున్నాయని భావించారు. కానీ మూఢమితో సంబంధం లేకుండా ధరలు పెరుగుతాయంటున్నారు మార్కెట్ నిపుణులు. అక్షర తృతీయకు మరింత ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది. బంగారం, వెండి ధరలు రానున్న కాలంలో మరింత పెరుగుతాయనడానికి ఇది ఒక సంకేతంగానే చూడాలంటున్నారు మార్కెట్ నిపుణులు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,060 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,060 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 84,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News