Breaking : కవితక్కకు దక్కని ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది

Update: 2024-05-06 06:38 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరించింది. కవిత వేసిన పిటీషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. రేపటితో కవిత జ్యడిషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు నలభై రోజులుగా తీహార్ జైలోలోనే ఉన్నారు. తొలుత మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను పది రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. తర్వాత కవితను తీహార్ జైలుకు తరలించారు.

సీబీఐ ఈడీ కేసుల్లో....
అనంతరం తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు ముగిశాయి. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని సీబీఐ, ఈడీ అధికారులు వాదించారు. సౌత్ లాబీ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీపార్టీకి అందించారని సీబీఐ, ఈడీ వర్గాలు బలంగా వాదిస్తున్నాయి. ఈ కేసుల్లో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువడింది.


Tags:    

Similar News