Enforcement Directorate : అటెండర్ ఇంట్లో ఇరవై కోట్లు.. నోట్ల కట్టలు లెక్క పెట్టలేక అధికారుల గుడ్లు తేలేశారట

ఝార్ఖండ్ లోని రాంచీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిపిన దాడుల్లో ఇరవై కోట్ల నగదు బయటపడింది

Update: 2024-05-06 05:33 GMT

ఎన్నికల సమయంలో నగదు పంపిణీ దేశంలో మామాలూ విషయం అయిపోయింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఖర్చు చేసే అభ్యర్థులు ఎవరూ లేరు. అధికారులు కూడా పెద్దయెత్తున దాడులు చేస్తూ ఎక్కడికక్కడ నగదును, బంగారాన్ని,అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఝార్ఖండ్ లోని రాంచీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిపిన దాడుల్లో ఇరవై కోట్ల నగదు బయటపడింది. అదీ మంత్రి గారి ఇంట్లో పనిమనిషి ఇంట్లో ఈ కరెన్సీ కట్టలు బయటపడటం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులలో...
ఇప్పటి వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ము ఇరవై కోట్ల రూపాయలు పైగానే ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టకింద రాంచీలోని పలు ప్రాంతాల్లో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసి రిటైర్ అయిన చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్ 2023 లో అరెస్టయ్యారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పది చోట్ల దాడులు నిర్వహించారు.
గది నిండా కట్టలే...
ఈ నేేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ వ్యక్తిగత కార్యదర్శిసంజీవ్ లాల్ వద్ద పనిచేస్తున్న అటెండర్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒక గదిలో ఉన్న కరన్సీ నోట్లను లెక్కేయడానికి అధికారుల మనీ కౌంటింగ్ మిషన్లు తెప్పించారు. వివిధ ప్రభుత్వ పథకాలలో అక్రమంగా వీరేంద్ర రామ్ వంద కోట్లు సంపాదించారన్న సమాచరంతో ఆయనను గత ఏడాది అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన సమాచారంతో పాటు ఆయన పెన్ డ్రైవ్ లో ఉన్న సమాచారం ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు జరిపారు. మొత్తం సొమ్ము ఎంతనేది పూర్తిగా లెక్కించిన తర్వాతే తెలియనుంద.ి


Tags:    

Similar News