శివకాశిలో బాణసంచా పేలుడు : 5గురు మృతి

Update: 2016-10-09 12:43 GMT

ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నప్పటికీ.. తీసుకుంటున్న జాగ్రత్తలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయా? దీపావళి సీజన్ వచ్చిందంటే.. బాణసంచా తయారీ కేంద్రాలు ప్రముఖంగా ఉన్న ఏ ప్రాంతాల నుంచి ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని భయం వేస్తూనే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే బాణసంచా తయారీలో చాలా కీలకమైన ప్రదేశంగా పేరున్న శివకాశిలో ఆదివారం నాడు ఓ బాణసంచా తయారీకేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది.

శివకాశి అంటేనే బాణసంచా తయారీకి పర్యాయపదం వంటి పట్టణం. ట్రాజెడీ ఏంటంటే.. ప్రతి ఏటా ఇక్కడ దీపావళి సమయంలో చిన్నా పెద్దా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా కొన్ని ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మరో 20 రోజుల్లో దీపావళి పర్వదినం ఉందనగా.. ఇలాంటి ప్రమాదం జరగడం శోచనీయం.

భారీ పేలుడు సంభవించడంతో.. బాణసంచా తయారీ షెడ్ మొత్తం ధ్వంసం అయిపోయింది.

Similar News