Amaravathi : పాపాల భైరవుడు నారాయణ.. రాజధాని అమరావతి నిర్మాణం కత్తి మీద సామే
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈసారి మాత్రం మంత్రి పదవులో ఉండి ఇబ్బందుల పడుతున్నారు
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈసారి మాత్రం మంత్రి పదవులో ఉండి ఇబ్బందుల పడుతున్నారు. ఇటు ప్రభుత్వ అధినేత చంద్రబాబు వద్ద, ఇటు రాజధాని రైతుల వద్ద నారాయణ విలన్ గా మారుతున్నారు. నారాయణ నిర్ణయాలు కాకపోయినా.. క్షేత్రస్థాయిలో అమలు చేసేది.. ప్రజలతో మాట్లాడేది ఆయనే కావడంతో మంత్రి నారాయణకు అటు..ఇటు.. రెండు వైపులా ఇబ్బందులు తప్పడం లేదు.రాజధాని అమరావతి పనులు వేగంగాచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లక్ష కోట్ల రూపాయల వరకూ అప్పులు తెచ్చి మరీ పనులను ఆహ్వానించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. రహదారుల నిర్మాణం, రోడ్ల వెడల్పు వంటివి కూడా రాజధాని ప్రాంతంలో చేపట్టాల్సి ఉంది.
బాబు ఎప్పటికప్పుడు క్లాస్...
పనుల వేగంగా జరగడం లేదని చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు నారాయణకు అక్షింతలు వేస్తున్నారు. పనులను నిరంతరం పరిశీలిస్తున్నప్పటికీ పనులు చేపట్టడంలో వేగం పెరగకపోవడానికి మంత్రి నారాయణ కాకపోవచ్చకు. అనేక కారణాలు ఆలస్యానికి రీజన్ అని అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు మాత్రం మంత్రి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ సమావేశంలోనూ పనులు జరుగుతున్న తీరును చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు రెండో విడత భూసమీకరణ కార్యక్రమం కూడా మంత్రి నారాయణకు తలనొప్పిగా మారింది. రైతులను ఒప్పించడానికి మంత్రి నారాయణ సతమవుతున్నారు. అదే సమయంలో కొందరు రైతులు అడ్డంతిరుగుతుండటంతో భూసేకరణ చేస్తామని బెదిరించి నారాయణ వారికి శత్రువుగా మారుతున్నారు.
రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా...
తాజాగా మందడంలో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లను కోల్పోతున్న వారికి ప్రభుత్వం వేరే చోట స్థలాలను కేటాయించింది. దాదాపు వందల సంఖ్యలో ఇళ్లు రోడ్ల విస్తరణలో పోతున్నాయి. అయితే నారాయణ వారిని ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. నిన్న మందడంలో జరిగిన సభలో రైతు రామారావు మంత్రి నారాయణతో వాగ్వాదానికి దిగి గుండెపోటుతో మరణించారు. మరొకవైపు తమకు వరద నీరుచేరు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను ఇచ్చారని, అక్కడ తాము ఎలా ఉండగలమని చాలా మంది ఇళ్లు కోల్పోయిన వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో కరవబోతే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపంలా మంత్రి నారాయణ పరిస్థితి తయారైందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇటు చంద్రబాబు వద్ద, అటు రైతుల చేత నారాయణ మాటలు పడుతూ అవస్థలు పడుతున్నారు.