Tirumala : తిరుపతి లడ్డూ కు మూడు వందలేళ్ల చరిత్ర.. లడ్డూను తొలిసారి తయారు చేసెందెవరంటే?

తిరుమలలో పర్యటనలో మరొక ప్రధానమైనది లడ్డూ ప్రసాదం

Update: 2025-12-28 04:10 GMT

తిరుమలకు వెళ్లే వారు శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో.. తలనీలాలను సమర్పించుకోవడం మొక్కులు చెల్లించడంలో భాగం. అలాగే తిరుమలలో పర్యటనలో మరొక ప్రధానమైనది లడ్డూ ప్రసాదం. ఈ లడ్డూకు మూడు మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమలలో లడ్డూ తయారీ 1480 నుంచి అమలులో ఉందని చరిత్ర చెబుతుంది. నాడు తిరుమల ప్రసాదాన్ని మనోహరం అని పిలుచుకునే వారట. 18వ శతాబ్దంలో ప్రారంభమయిన లడ్డూ ప్రసాదం రుచిలో నేటికీ మార్పు లేదు. అదే రుచి.. అదే వాసన. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులకు లడ్డూ నిజమైన ప్రసాదం. స్వామి వారి లడ్డూ తినకుండా, తీసుకురాకుండా ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదంటారు.

1940 దశకంలో...
1940లో నాటి మద్రాసు ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమలలో లడ్డూ తయారీ ప్రారంభమైందని చెబుతున్నార. అయితే తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయంటున్నారు. సుమారు లడ్డూ తయారీలో ఆరు మార్పులు జరిగాయన్నది చరిత్రకారులు చెబుతున్న మాట. గత కొన్ని దశాబ్దాలుగా తయారీలో ఎటువంటి మార్పులు జరగకపోయినా తొలి నాటి లడ్డూ తయారీ నుంచి ఆరుసార్లు మాత్రమే మార్పులు జరిగాయని చెబుతున్నారు. అయితే ఈ లడ్డూ ప్రసాదాన్ని తొలిసారి తయారు చేిన వ్యక్తి కల్యాణం అయ్యంగార్ అని చరిత్ర చెబుతుంది. కల్యాణం అయ్యంగార్ లడ్డూ తయారీకి నాందీ పలికిన వ్యక్తి అని పురావస్తు గ్రంధాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
మిరాసీ దారీ వ్యవస్థను...
తిరుమల శ్రీవారికి నైవేద్యంగా పెట్టి అదే పదార్ధాన్ని భక్తులకు ప్రసాదంగా అందించాలన్న ఆలోచనతోనే లడ్డూ తయారీ జరిగిందని చెబుతారు. తర్వాత స్వామి వారి ప్రసాదంలో అది అగ్రభాగాన చేరింది. కల్యాణం అయ్యంగార్ మద్రాస్ కు చెందిన వారైనా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి అంటే ఎనలేని భక్తి కలిగిన వారు. పరోపకారం చేయడంలో మొదట ఉంటారు. దానగుణం కలిగిన వారు. లడ్డూ తయారీ ని ఆయన చేసిన తర్వాత ఆ బాధ్యతను తన కుమారుడు, ఇతరకుటుంబ సభ్యులకు ఆ బాధ్యతలను అప్పగించారట. దానినే మిరాసీ దారీ వ్యవస్థగా వ్యవహరిస్తున్నారు. మిరాసీదారీ వ్యవస్థను కూడా కల్యాణం అయ్యంగార్ ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమంలో లడ్డూ తయారీని టీటీడీ ఉద్యోగులే చేస్తున్నారు. అదీ తిరుమల శ్రీవారి లడ్డూ చరిత్ర. ధనుర్మాసంలో ఒకసారి లడ్డూ చరిత్ర తెలుసుకునేవారికి ఇది ఉపయోగపడుతుందని కొందరు నెట్టింట వైరల్ చేశారు.
Tags:    

Similar News