Tirumala : తిరుమలకు మరో వారం వచ్చే వారికి అలెర్ట్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

Update: 2025-12-28 03:35 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా శుక్రవారం నుంచి రద్దీ మొదలయి సోమవారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. స్వామి వారి హుండీ ఆదాయం కూడా గతంలో కంటే గణనీయంగా పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. అదే సమయంలో శ్రీవారి సేవకుల సేవలను ఉపయోగించుకుని భక్తులకు సౌకర్యాలను అందించడంలో అండగా ఉంటున్నారు.

ఎల్లుండి నుంచి...
తిరుమలలో ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి జనవరి ఏడో తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎస్.ఎస్.డి. టోకెన్లను జారీని రద్దు చేశారు. ఈ తేదీల్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు ఇవ్వరని అధికారులు . ఈనెల 30, 31, జనవరి ఒకటో తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. టోకెన్లు లేనివారిని Jan 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్లో అనుమతిస్తారు.
నేడు పన్నెండు గంటల సమయం...
డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి. ఆ రోజు వైష్ణవాలయాలు వైకుంఠ ధామాలుగా మారుతాయి. అదే రోజున మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలో కానికి వస్తారని ప్రతీతి. ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 91,147 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,400 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.31 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.





Tags:    

Similar News