శిక్షలు తప్పవు అంటున్న మావోయిస్టునేత కైలాసం

Update: 2016-10-28 07:30 GMT

గాయపడ్డవాళ్లను పోలీసులు పట్టుకుని ఉన్నారు. వారిని చిత్రహింసలు పెట్టి ప్రతిరోజూ కొందరిని కాల్చి చంపుతూ ఎన్ కౌంటర్ కింద క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు బుద్ధి తెచ్చుకుని వెంటనే తమ అదుపులో ఉన్న మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని, వారికి సరైన చికిత్స అందించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కైలాసం అన్నారు.

రామకృష్ణ అలియాస్ ఆర్కేను పోలీసులు పట్టుకుని తమ నిర్బంధంలోనే ఉంచుకున్నారని తమకు అనుమానంగా ఉన్నదని నక్సలైట్లు చెబుతున్నారు. ఆర్కేను వెంటనే కోర్టు ఎదుట చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది పచ్చి బూటకపు ఎన్‌కౌంటర్ అని కైలాసం ఆరోపిస్తున్నారు. ఇన్‌ఫార్మర్ల ద్వారా సమాచారం తెలుసుకుని, పక్కాగా చుట్టుముట్టి మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపారని తమకు ఖచ్చితంగా తెలుసునని కైలాసం అంటున్నారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీసీఎం చంద్రబాబునాయుడు ఇద్దరూ కారకులు అని... ఆ ఇద్దరినీ తమ పార్టీ తప్పకుండా శిక్షిస్తుందని కైలాసం అంటున్నారు.

మావోయిస్టు పార్టీ సభ్యుడు కైలాసం చెబుతున్న మాటలను ఈ కింది ఆడియో లింకు ద్వారా వినండి.

Similar News