రాజధాని శంకుస్థాపన పనులకు ఇప్పడు నిధులు మంజూరు

Update: 2017-07-04 01:42 GMT

రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా అత్యవసరంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శాఖాపరంగా చేపట్టిన 18 పనులకు ఖర్చు చేసిన రూ. 4.29 కోట్ల నిధులు విడుదల చేసేందుకు మంత్రిమండలి ఆమోదించింది. ఆ పనులపై పరిశీలన జరిపి వెంటనే నిధులను మంజూరుచేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

వడ్డీ వ్యాపారుల ఆటకట్టు

2015లో వడ్డీ వ్యాపారుల కోసం చేసిన బిల్లు స్థానంలో ఆంధ్రప్రదేశ్ మనీ లెండర్స్ బిల్-2017కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం వడ్డీ వ్యాపారులు లైసెన్స్ పొందవలసి ఉంటుంది. వారికి ఇచ్చే లైసెన్స్ మూడు సంవత్సరాలపాటు ఉంటుంది. వారు తీసుకునే వడ్డీని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ప్రతి ఏడాది అకౌంట్స్ ఆడిటింగ్ చేయాలి. అధిక వడ్డీ వసూలు, తప్పుడు మొత్తం నమోదు, రుణ గ్రహీతల పట్ల వేధింపులు, అధిక జరిమానాలను విధించడం, ఆస్తులను జప్తు చేయడం, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు తదితర అంశాలు ఈ బిల్లులో పొందుపరచారు.

Similar News