రహానే సెంచరీ : దూసుకెళ్తున్న భారత్

Update: 2016-10-09 05:00 GMT

ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ హవా కొనసాగుతోంది. తొలిరోజు ఫాంలోకి వచ్చిన కెప్టెన్ కొహ్లి అపురూపమైన సెంచరీతో కివీస్ బౌలర్లను బెంబేలెత్తించగా.. రెండోరోజు ఆజింక్య రహానే కూడా తన సెంచరీ ని పూర్తి చేశాడు. కాకపోతే.. ఆజింక్య రహానే తన సెంచరీని పూర్తి చేయడానికి 210 బంతులు తీసుకోవడం గమనార్హం.

భారతజట్టు ఆటగాళ్లు ఉన్న ఫాంను గమనిస్తే మాత్రం.. మూడో టెస్టులో కూడా ఘన విజయం ఖరారు అన్నట్లగానే ఉంది. ఇవాళ భారీ స్కోరు నమోదు చేసి.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. న్యూజీల్యాండ్ ను బ్యాటింగ్ కు దించడం వారి వ్యూహం గా ఉండే అవకాశం ఉంది.

రెండో రోజు ఆటలో తొలి సెషన్లోనే ఆజింక్య రహానే సెంచరీ పూర్తయింది. కివీస్ బౌలర్లు తొలిరోజు మూడు వికెట్లు తీయడం మినహా.. కొహ్లి - రహానే జోడీ మీద ఏ రకంగానూ ప్రభావం చూపించలేకపోవడం విశేషం. ఈ ఇద్దరి జోడీ 200 పరుగుల స్కోరు కూడా పూర్తి చేశారు.

Similar News